Investment Plans : ఈ ఫార్ములా ఉపయోగించండి డబ్బున్న వాళ్ళు అయిపోండి

ప్రపంచంలో ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని కోరిక తప్పనిసరిగా ఉంటుంది. దానికోసం మనం చాలా శ్రమిస్తూ ఉంటాం. మనం సంపాదించిన డబ్బును రెట్టింపు చేయడం కోసం చాలా మార్గాలు వెతుకుతుంటాం. అలా వెతికే మార్గంలో సరైన అవగాహన లేక మరియు ఆర్థిక సూచనలు తెలీకపోవడం వల్ల అలాగే డబ్బుని ఎలా ఎక్కడ ఎలా వాడాలో తెలియక మనం డబ్బును వృధా చేస్తుంటాం

అలాంటి వాటి మీద ఒక అవగాహన తెలిసినట్లయితే మనం సరైన వాటిలో పెట్టుబడులు పెట్టగలిగితే డబ్బు సంపాదించడం పెద్ద విషయం ఏమీ కాదు.

Investment Ideas
credit : cottonbro studio - ఈ ఫార్ములా ఉపయోగించండి కోటేశ్వరుడు అవ్వండి

సందేహం

డబ్బులు సంపాదించాలంటే మన దగ్గర కావాల్సినంత డబ్బును పెట్టుబడులుగా పెట్టాలని అందరి ఉద్దేశం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా, మనకు వచ్చే జీవితంలో ప్రతి నెల కొంత డబ్బును ఆదా చేస్తే చాలు

 అలా ఆదా చేసిన డబ్బును సరైన వాటిలో పెట్టుబడులుగా పెట్టగలిగితే, అంటే సింపుల్గా చెప్పాలంటేఇన్వెస్ట్మెంట్చేయగలిగితే డబ్బును సంపాదించిన పెద్ద విషయం ఏమి అవ్వదు కదా.

కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం సరైన పెట్టుబడి మార్గంలో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి మనం తెలుసుకోవాలి . అందుకోసం ముందుగా మనం 50*30*20 ఫార్ములా గురించి తెలుసుకోవాలి .

అసలు ఏంటి ఫార్ములా, దీన్ని ఎలా ఉపయోగించాలి?

డబ్బులు సరిగా అప్పుడే ఉపయోగించడం అనేది కూడా, అంత సులభమైన విషయం కాదు. కొన్నిసార్లు మనం ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. అటువంటి సమయాల్లో 50*30*20 ఫార్ములా చాలా  బాగా ఉపయోగపడుతుందని చాలా మంది పెద్దలు చెబుతుంటారు

ఫార్ములా మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం నెల వారు సంపాదించే మీ జీతంలో, దానిని మూడు భాగాలుగా చేసుకుందాం. దానిలో మొదటగా మనం చెప్పిన దాని ప్రకారం 50 శాతాన్ని  ఇంటి అద్దెకిరాణా మరియు రవాణా వంటి  అవసరాలకు ఖర్చు చేయాలి. మరియు రెండవది అనగా 30 శాతాన్ని మనం ఆహారం కోసం, వినోదం కోసం మరియు షాపింగ్ వంటి అవసరాల కోసం ఉపయోగించాలి. ఇంకా మిగిలిన 20 శాతాన్ని మనం మన భవిష్యత్తు కోసం అనగా ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేందుకు  వినియోగించాలి .

ఇలా మనం ఉపయోగించడం వల్ల మనం సేవింగ్స్ చేసుకున్న వాళ్ళం అవుతాం.

ఎలాంటి పెట్టుబడులు?

50*30*20 ఫార్ములా ద్వారా మీరు మీ డబ్బును పొదుపు చేసుకున్న వాళ్లయితే, డబ్బును మీరు SIP వంటి వాటిల్లో పెట్టుబడులుగా పెట్టవచ్చు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో మీ జేబుపై ఎటువంటి భారం ఉండదు. దీర్ఘకాలంలో రాబడును కూడా చాలా బాగుంటాయి

ఎలా అంటే 15 సంవత్సరాల పాటు ఏడాదికి 15% చొప్పున ప్రతినెల 15000 రూపాయలు పెట్టుబడి పెడితే, దాదాపు 27 లక్షలు రూపాయలు అవుతుంది. మళ్లీ దీనిపై వడ్డీ ఆదాయం 73 లక్షల వరకు వస్తుంది. అంటే అసలు పెట్టుబడి దానిపై రాబడి కలుపుకుంటే మొత్తం మీద కోటి రూపాయలు కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.  

అలాగే ఇదేవిధంగా ఎవరైనా మీ పెట్టుబడిని 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే దాదాపు దాని సంపాదన 10 కోట్లను మించుతుంది

ఫైనల్ గా నా అభిప్రాయం ఏమిటంటే SIP అనే కాదుఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే మీరు వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, మంచి ఆదాయం పొందాలి అని మీ శ్రేయోభిలాషిగా నేను ఇచ్చే ఒక సందేశం.

Post a Comment (0)
Previous Post Next Post