Google ఇప్పుడు దీని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే Searching రంగంలో తన దగ్గర ఉన్నంత సమాచారం మరి ఇంకెవరి దగ్గర ఉండదు కాబట్టి.
గూగుల్ ఎప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ప్రపంచానికి కావాల్సిన సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది.
Google మనకు చాలా కొత్త ఫీచర్స్ ని మనకు అందుబాటులో ఉండేలా చేసింది. అందులో భాగంగా గూగుల్ ఫొటోస్, గూగుల్ మ్యాప్, కాంటాక్ట్స్, మీట్స్, డాక్యుమెంట్స్, ఇమెయిల్ ఇంకా మరెన్నో ఫీచర్ ని డెవలప్ చేస్తుంది.
Google photos గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం
Google Photos దీని గురించి కూడా తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటా, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక యాప్ గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో మనం తీసుకున్న ఫోటోలను దాచిపెడుతుంది, మనకిది ఆయా సమయంలో ఫోటోలు తీసుకున్న వాటిని సమయమును బట్టి రిమైండ్ కూడా చేస్తుంది.
![]() |
| Pic credit : google photos - Google photos helps to Hide private Photos |
Google photos లో మీకు ఒక హిడెన్ ఫీచర్ గురించి తెలుసుకుందాం
Locked Folder లాక్ ఫోల్డర్ ఎలా సెట్అప్ చేయాలో తెలుసుకుందాం
Android లేదా iOS లో లాక్ చేయబడిన ఫోల్డర్ లో సెటప్ చేయడానికి, గూగుల్ ఫోటో యాప్ ని తెరిచి, మీ స్క్రీన్ దిగున ఉన్న “లైబ్రరీ” ట్యాబ్ ను నొక్కండి. అప్పుడు “యుటిలిటీస్” ఆప్షన్ ద్వారా “లాక్ ఫోల్డర్” ని ఎంచుకోండి.
Google photos యాప్ లాక్ చేయబడిన ఫోల్డర్కి పాస్వర్డ్ను సెట్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. దాని యాక్సెస్ కోసం మీరు మీ బయోమెట్రిక్ ధృవీకరణ (Androidలో వేలిముద్ర రీడర్, iOSలో ఫేస్ అన్లాక్) ని సెట్ చేయండి. ఇప్పుడు మీరు Google photos Locked Folder ని ఉపయోగించడానికి సిద్ధమైనట్లే.
ఇక్కడ నుండి, మీరు మీ Google ఫోటోల లైబ్రరీ నుండి ఫొటోస్ ని ఎంచుకుని, వాటిని లాక్ చేయబడిన ఫోల్డర్కి తరలించాలి.
Google Photos Locked Folder లోకి ఎలాంటి ఫొటోస్ తరలించాలి
మీరు లాక్ చేయబడిన ఫోల్డర్లో సేవ్ చేయబడిన ఫోటోలు మీ Google ఫోటోల గ్రిడ్ లో కనిపించవు మరియు అవి ఏ యాప్లలో కనిపించవు.
మీరు ఇప్పుడు మీ లాక్ చేయబడిన ఫోల్డర్ ను క్లౌడ్ కు బ్యాకప్ చేయవచ్చు అవి ఎలాంటివి అంటే వివాహానికి సంబంధించినవి , బహుమతులు (awards ) , పర్సనల్ సెల్ఫీస్ మరియు టూర్ ఫొటోస్ ఇలాంటివి మరి ఎన్నో సురక్షితంగా ఈ లాక్ ఫోల్డర్ లో దాచి పెట్టవచ్చు.
ఒకవేళ మీరు మీ ఫోను పోగొట్టుకున్నట్లయితే, ఈ బ్యాకప్ ని ఉపయోగించి మీ ఫొటోస్ ను మళ్ళీ తిరిగి తీసుకొని రావచ్చు . అది మీ ఫోన్లో కానీ లేదా టాబ్లెట్లలో దేని నుండి అయినా యాక్సెస్ చేయవచ్చు, ఎలా అంటే మీ బయోమెట్రిక్ ధృవీకరణ (Androidలో వేలిముద్ర రీడర్, iOSలో ఫేస్ అన్లాక్) సహాయంతో.
ఒకవేళ మీరు మరీ పర్సనల్ ఫొటోస్ ను దాచి పెట్టాలి అనుకుంటే మీరు మరో కొత్త క్లౌడ్ బ్యాక్అప్ ఫీచర్ ని ఎంచుకోవడం మంచిది అని నా ఉద్దేశం లేదా ఒకవేళ ఆఫ్లైన్లో ఉంచాలి అనుకుంటే గూగుల్ దానికోసం గా కొన్ని కొత్త సెట్టింగ్స్ ను విడుదల చెయ్యబోతుంది. ఈ కొత్త సెట్టింగ్‌ల పేజీ Android మరియు iOS రెండింటిలోనూ ఉంది.
ఈ ఫీచర్ లను మీరు పొందాలి అనుకుంటే మీ “iPhone లేదా Android” గూగుల్ ఫొటోస్ యొక్క లేటెస్ట్ వర్షన్ నీ అప్డేట్ చేసుకోవాలి.
Source : Google
